LIVE
ఏపీలోనూ సోషల్ మీడియా బ్యాన్
వెనక్కి

ఏపీలోనూ సోషల్ మీడియా బ్యాన్

44 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలకు ఏపీలో సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధించనున్నట్లు సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 13 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానం 90 రోజుల్లో దశలవారీగా అమలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వయస్సు పరిమితి 13 వరకే పరిమితం చేయాలా లేక 16 సంవత్సరాల వరకు పెంచాలా అనేది త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోందని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో యువతపై డిజిటల్ వినియోగం చూపే ప్రభావాలను అరికట్టడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 03:27 PMకి